అటెండెన్స్ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వాడిన పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్…

ఆగస్టు 1,జగిత్యాల (మన వార్త ప్రతినిధి)జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందాయ పల్లె గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రాజన్న రోజు విధులకు హాజరు కాలేక అటెండెన్స్ కోసం తాను లేకపోయినా అటెండెన్స్ పడడానికి ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు వాడి అటెండెన్స్ వేయించుకుంటున్న తరుణంలో అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం వల్ల జగిత్యాల జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి రాజన్న ను సస్పెన్షన్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది . ఈ యొక్క కార్యదర్శుల పనితీరు ఇలా ఉండడం చాలా బాధాకరమని ఇకపైన ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ యొక్క పంచాయతీ కార్యాలయంలోనే కాదు మరికొన్ని కార్యాలయాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ జరుగుతోందని కొంతమంది కుర్చీలు బల్లలు ఎదురుగా పెట్టి మరి అటెండెన్స్ లు వేసుకుంటున్నటు వంటి పరిస్థితులు నెలకొన్నాయని వాటిని కూడా పరిశీలనలో తీసుకొని వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని అధికారులు,ప్రజలు భావిస్తున్నారు.

Leave a Comment