స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం….

* మల్యాల, ఆగష్టు 03(మన వార్త ప్రతినిధి)మల్యాల కేంద్రానికి చెందిన వారంతా 1995 -96 సంవత్సరంలో 10వ తరగతి కలిసి చదివారు. “స్నేహమేరా జీవితం” అను వాట్స్అప్ గ్రూప్ ద్వారా నిత్యం పలకరించుకుంటారు. స్నేహితులలో ఎవరి పుట్టినరోజు అయిన, పెళ్లి రోజైనా అందులో శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఆనాటి నుంచి చిగురించిన వారి స్నేహం గత 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. కష్టసుఖాలను సమానంగా పంచుకుంటూ.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారు. అందరూ కలిసి ఒకరినొకరు తోడుగా ఉంటూ ఆ గ్రామానికే ఆదర్శంగా నిలుస్తూ స్నేహానికి వన్నెతెచ్చారు.

Leave a Comment