విద్యార్థులతో పుస్తకాలు మోయించిన ఉపాధ్యాయులు- జగిత్యాల మైనారిటీ గురుకులం ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం….

…ఆగస్టు 1 జగిత్యాల (మన వార్త ప్రతినిధి)జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న మైనారిటీ గురుకులం ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థులతో పుస్తకాలు మోయించిన ఉపాధ్యాయులు ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి టీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా వచ్చిన పుస్తకాలను స్కూల్ లోపలికి తరలించేందుకు స్కూల్ నుండి కార్గో బస్సు రోడ్డు మార్గం లేకపోవడంతో చాలా దూరంలోనే నిలిపివేశారు. అక్కడి నుండి అటెండర్ల సహాయంతో స్కూల్ లోపలికి తరలించాల్సిన పుస్తకాలు అటెండర్లు లేకపోవటంతో, కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల చేతే ఆ పుస్తకాలను మొయించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పలువురు తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా శారీరకంగా అలసిపోయే పనులకు పాల్పడించటం బాధాకరమని వారు మండిపడుతున్నారు. ఒక విద్యాసంస్థలో, ముఖ్యంగా గురుకులాల్లో విద్యార్థులకు భద్రత, ఆరోగ్యం ప్రథమమై ఉండాల్సిన సమయంలో ఈ రకమైన చర్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండు తల్లిదండ్రుల నుండి వెలువడుతోంది.

Leave a Comment