గడ్డి మందు సేవించి యువకుడు మృతి కుటుంబ సభ్యుల రోదన.మొలంగూర్ గ్రామంలో విషాదం…

శంకరపట్నం:జూలై31(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్)శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ళ శ్రీకాంత్ (25)అనే యువకుడు గడ్డి మందు సేవించి గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్ తండ్రితో కలిసి సొంత భూమితో పాటు కొంత వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు, కాగా బుధవారం గడ్డి మందు సేవించిన శ్రీకాంత్ ను కుటుంబ సభ్యులు గమనించి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.అందరితో కలివిడిగా ఉండే శ్రీకాంత్ మృతి పట్ల గ్రామంలో విషాదం నెలకొంది.కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Leave a Comment