ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

వాజేడు జులై 28 మనవార్త

భారతదేశం తరపున పవర్ లిఫ్టింగ్ లో ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మొడెం వంశీ నార్త్ అమెరికా కు వెళ్ళుటకు ఆర్ధిక స్థోమత లేకపోవడంతో 75000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.నార్త్ అమెరికా వెళ్ళుటకు సుమారు 3 నుండి 4 లక్షలు ఖర్చు అవుతుంది నిరుపేద కుటుంబం ఆర్థిక స్తోమత లేకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నూ సహాయం అడుగగా తనవంతుగా ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకలమర్రి లక్ష్మీనరసింహారావు 25000 రూపాయలు,మాజీ నూగురు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ 50000 రూపాయలు మొత్తం 75000 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.పర్సనల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు మోడిగ తిరుపతి యాదవ్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు చెన్నం సాంబశివరావు,పార్టీ నాయకులు మొడెం ప్రకాష్, మోడెం నాగరాజు,యూత్ నాయకులు బోదేబోయిన మనోవికాస్,వేములవాడ వేణు పరిశిక, రామకృష్ణ,కిరణ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment