— చందుర్తి మండలం జూలై 26
చందుర్తి మండలంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డలో వర్షంలో వినూత్నంగా ఉత్సాహంగా రెయిన్ డే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ, గొడుగులు తిప్పుతూ ఆనందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వర్షపు నీరును మనము ఏవిధంగా స్టోరేజ్ చేసుకోవాలి, వాగులు, నదులు మరియు చెరువులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, వర్షం కురవడానికి కారణమైన అడవులను ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే విషయాల గురించి మరియు నీటి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ నీరును వృధా చేయకూడదని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భార్గవి మేడం గారు, రామస్వామి గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.