రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం-తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్….

. తూప్రాన్ జులై 25 (మన వార్తా ప్రతినిధి ఆంజనేయులు గౌడ్) రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా, ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై ఇకనుండి పోలీసులు కొరడా జూలిపించనున్నారు. తూప్రాన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేసినట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని డీఎస్పీ సూచించారు.

Leave a Comment