అక్రమ ఇసుక తరలించడంలో అక్రమ ఇసుక కింగ్ రమేష్ నాకు రాజకీయ నాయకుల అధికారుల అండదండలు ఉన్నాయి ఏం చేసుకుంటారో చేసుకో అంటూ టిప్పర్లతో అక్రమ ఇసుక రవాణా…..

కల్వకుర్తి పట్టణంలో ఎల్లికల్ గ్రామం నుండి టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమ ఇసుక డాన్ రమేష్. జర్నలిస్టులు ఇతను ఇసుక రవాణా చేస్తుంటే ఫోటోలు తీస్తుండగా అరేయ్ నువ్వు ఎవర్రా నా వెనకాల రాజకీయ నాయకుల అధికారుల అండదండలు ఉన్నాయి నువ్వు నన్ను ఏమి చేయలేవు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అక్రమ ఇసుక డాన్ రమేష్.ఇందిరమ్మ ఇండ్ల పేరుతో జోరుగా టిప్పర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఎవరైనా ఇతని అక్రమ ఇసుక టిప్పర్ ఆపితే మీ అంతు చూస్తానని బెదిరిస్తున్నట్టు గ్రామస్తులు అంటున్నారు.ఇతని ఇసుక టిప్పర్లు అతివేగంతో తమ గ్రామంమీదుగావెళుతున్నాయని విద్యార్థులు స్కూళ్లకు.కాలేజీలకు వెళ్లే టైంలో ఇతని టిప్పర్లు అతివేగంగా రావడం జరగరాని ప్రమాదం జరుగుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఈ అక్రమ ఇసుకను మాత్రం ఆపడం లేదని గ్రామస్తులు మీడియా మిత్రులకు తెలియజేశారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందిస్తుంది.ఇదే అదునుగా చూసిన ఇసుక డాన్ రమేష్ బడా నేతల అధికారుల పేర్లు చెప్పుకుంటూ అక్రమ ఇసుక అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా నియోజకవర్గాలను దాటిస్తున్నారు.సంబంధిత అధికారులుపట్టించుకోకపోవడంతో రఘుపతి పేట, ఉల్పర, చింతపల్లి, నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.నిత్యం వ్యాపారులకు ఇసుక దందా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ అక్రమ ఇసుక అరికట్టడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టువ్యవహరిస్తున్నారనీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసే నాథుడే కరువయ్యాడనీ. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన అధికారులు వాహనానికి ఇంతా అంటూ మాముళ్లు దండుకుంటున్నట్లు అక్రమ ఇస్తా నడిపే రమేష్ సోయాన్న చెప్పడం అధికారులపై పలు అనుమానాలువస్తున్నాయి.ఈ అక్రమ వ్యాపారంలో కొందరు రాటుదేలి ఈ వ్యాపారాన్ని ఉపాధిగా చేసుకొని దర్జాగా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.కల్వకుర్తి కేంద్రం మీదుగా నిత్యం 30 నుండి 40 టిప్పర్ల అక్రమ ఇసుక రవాణాప్రతిరోజు సాగుతుంది. ఈ అక్రమ దందాను కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు పలు గ్రామాల ప్రజలు అంటున్నారు.దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది.

Leave a Comment