మల్కాజ్గిరి జిల్లా,జూలై 19 మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : అల్వాల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం సాయినగర్ కాలనీలోని నల్ల పోచమ్మ ఆలయం సమీపంలో,సెలెక్ట్ థియేటర్ దగ్గర, ఆసుపత్రి పక్కన చెట్టు కింద గుర్తుతెలియని పురుష మృతదేహం కనుగొనబడింది.ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.మృతుడు వయసు సుమారు 40-45 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా. ఇతడు మెడలో క్రైస్తవ సిలువ ధరించి ఉన్నాడు. ధరిస్తున్న దుస్తులు గ్రే అండ్ బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్ టీషర్ట్, దాని కింద ఎరుపు-నలుపు చెక్స్ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్. మృతుని ఎత్తు సుమారు 5 అడుగులు 8 అంగుళాలు.గుర్తింపు గుర్తులు:కుడి చేయిపై “Kavitha” అనే పేరు మరియు త్రిశూల్ ఆకారంలో గుర్తు టాటూ ఉంది.ఎడమ వైపు ఛాతీపై “Narayana and valyi” అనే పేర్లతో టాటూ ఉంది.ఈ మృతదేహం ఎవరిదో గుర్తించగలిగే సమాచారం మీ వద్ద ఉంటే, వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం (సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:8712663259:9490617215:8712554138 అల్వాల్ పోలీస్ స్టేషన్) ఇవ్వగలరు అన్నారు.