గజ్వేల్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వి. రవికుమార్

గజ్వేల్ జూలై 18 (మన వార్త ప్రతినిధి జీ మురళి)

గజ్వేల్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వి. రవికుమార్, తదనంతరం ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారిని కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడమ్ గారు అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ హెల్మెట్ వినియోగము, త్రిబుల్ రైడింగ్ తదితర అంశాల గురించి వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని తెలిపారు.

Leave a Comment