జూలై 15 (మన వార్త ప్రతినిధి జీ మురళి)జగదేవపూర్ గర్ల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది,మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత.చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించిన *జగదేవపూర్ రాయపోల్ ఏఎస్ఐ సుభాష్, గజ్వెల్ షీటీమ్ బృందం హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుల్ మహేష్ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ రామకృష్ణారెడ్డి,మరియు ఉపాధ్యాయులు. తదితరులు పాల్గొన్నారు.