తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జులై 13, మనవార్త.
మేడిపల్లి లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు మేడిపల్లిలోని కార్యాలయంపై అటాక్ చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అక్కడ బీభత్సం పరిస్థితి నెలకొంది. కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే దాడి చేసినట్లు తెలుస్తోంది.