జూలై 13 (మన వార్త ప్రతినిధి జీ మురళి)సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహాయార్థం విరాళం అందజేసిన పల్లవి ఫుడ్ కోర్ట్ అధినేత మిర్చిబండి సతీష్ నాగరాణి దంపతులు వారి కుమారులు రాజా, కళ్యాణ్ ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుకు రాజు ముదిరాజ్ మాట్లాడుతూ శ్రీ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్ లో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన మిర్చిబండి సతీష్ కుటుంబ సభ్యులకు అమ్మవారి కరుణ కటాక్షాలు ఉంటాయని ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసేవారు ముందుకు రావాలని,గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలు విరాళం ఇచ్చే వారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు