- కొత్త చెందర్ గౌడ్, కొత్త రవి గౌడ్.
తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారీ, జూన్ 25, మనవార్త.
తెలంగాణలో అమ్మవారిని పూజించే ఉత్సవం బోనాల పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన గ్రామదేవతల పండుగిది.రాష్ట్ర పండుగ బోనాల జాతరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్ల ముస్తాబవుతోంది. జులై 27న ఆదివారం బోనాల వేడుకలు జరుపుకొనుటకు గ్రామ పెద్దలు, మాజీ కార్పొరేటర్ కొత్త చెందర్ గౌడ్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్, బోడుప్పల్ కార్పొరేషన్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త రవి గౌడ్,మాజీ క-ఆఫక్షన్ సభ్యులు రంగ బ్రాహ్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త ప్రభాకర్ గౌడ్ మరియు కుర్రి శివశంకర్, కొత్త శ్రీశైలం గౌడ్, కొత్త గోపాల్ గౌడ్,కొత్త విక్రమ్ గౌడ్, కుర్రి మహేష్, వివిధ కుల సంఘాల పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, కాలనీల ప్రెసిడెంట్లు సెక్రటరీలు తదితరులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అనంతరం కొత్త చెందర్ గౌడ్, కొత్త రవి గౌడ్ లు మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా భావించే మన బోనాల పండుగను చెంగిచెర్ల గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరడమైనది.