హనుమకొండ జూన్ 22(మనవార్త ప్రతినిధి):హనుమకొండ లో విశ్వసనీయ సమాచారంతో మచిలీ బజార్ ఏరియాలో ఒక ఇంటి ఆవరణలో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకున్నట్టు హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు. వారి దగ్గర నుండి ఏడు సెల్ ఫోన్లు 13,020 రూపాయలను మరియు మరియు పేకముక్కలని స్వాధీన పరచుకోవడం జరిగింది తర్వాత సిఐ మాట్లాడుతూ చాలామంది ప్రజలు ఇట్టి జూదానికి మద్యానికి బానిసై అప్పుల పాలై కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు వీరిని పట్టుకున్న ఎస్ఐ కిషోర్ మరియు సిబ్బందిని అభినందించారు