మేడిపల్లి మండల ప్రింట్ మీడియా నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి.

  • ప్రధాన కార్యదర్శిగా వడ్డెమాను సుందర్.
  • కోశాధికారిగా మరాటి మల్లేష్.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 22, మనవార్త.

మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా చిర్ర శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వడ్డెమాను సుందర్, కోశాధికారిగా మరాఠి మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ సమన్వయంతో ముందుకు సాగుదాం జర్నలిజం విలువలు పెంపొందించేందుకు కృషి చేద్దాం అన్నారు. శనివారం నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.వెంకట్రాం రెడ్డి తో పాటు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా ముందుకు సాగాలని తెలిపారు.జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి మాట్లాడుతూ నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జర్నలిస్టులుగా మన వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు దృష్టి సారించాలని అన్నారు. ఈ ఎన్నికలకు సమన్వయ కర్తలుగా వీఎస్ఎన్ రెడ్డి, కల్కూరి ఎల్లయ్యలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోశాధికారి ఎన్.రాములు యాదవ్,మేడిపల్లి మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Comment