నిలువుదోపిడి చేస్తున్న మరో కార్పొరేట్ భూతం శ్రీ చైతన్య…..

నారాయణ – నేడు శ్రీ చైతన్య బాగోతం బయటపెట్టిన బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు.- జీవోలన్నీ నీళ్లపాలు..వనపర్తి జిల్లాలో.- ఫీజులు పుస్తకాల పేరిట పాఠశాలలు నిలువుదోపిడి.- పాఠశాల సమీపంలో… డబుల్ బెడ్రూం ఇళ్లలో పుస్తకాల అమ్మకాలు.- మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు. – ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న వనపర్తి ఎంఈవో.- మున్సిపల్ అధికారులను పిలిపించి పుస్తకాల గదికి తాళం వేయించిన వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్.- విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని వెల్లడి.దేవరకద్ర,జూన్21(మన వార్త ప్రతినిధి, జి. రవికుమార్)జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయింది.వ్యాపార దోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. ఎంతో కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువునకే ఖర్చు అవుతుండడంతో పేద,మధ్య తరగతి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లోనే చదివించాలంటేనే జంకుతున్నారు.విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.పాఠశాలల్లో ఫీజులకు తోడు యూనిఫామ్‌లు, పుక్తకాలు, నోటుబుక్కులు, బస్సు ఫీజులు అంటూ వసూలు చేస్తున్నారు. విద్యా సంస్థలు ప్రారంభం అవుతుందంటే చాలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి పిల్లలను చదివిస్తూ అప్పుల పాలవుతున్నారని బిసి పొలిటికల్ జెఎసి నాయకులు వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్ కోరారు.

Leave a Comment