మల్కాజ్గిరి జిల్లా జూన్ 20 వార్త జిల్లా ప్రతినిధి అంతోని : మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మర్రి రాజశేఖర్ రెడ్డి శుభవార్త చెప్పారు. మల్కాజ్గిరిలోని ఏఓసీ సెంటర్, చక్రబంధం ప్రాంతాల నుంచి విముక్తి దిశగా నిర్ణయాత్మక అడుగులు పడుతున్నాయని తెలిపారు.
ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలైన ఆర్కేపురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసీ సెంటర్లలో అదనపు రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని, అదే విధంగా రక్షణ శాఖకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూముల్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ అభివృద్ధి ప్రయోజనంతో మల్కాజ్గిరి ప్రజలు త్వరలోనే సికింద్రాబాద్, తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు నేరుగా వెళ్లే అవకాశాన్ని పొందబోతున్నారని చెప్పారు. నేడు ఉన్న చక్రబంధాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి రావడం, ఇది ట్రాఫిక్ సడలింపుతో పాటు స్థానికుల సమయాన్ని, ఇబ్బందులను తగ్గిస్తుందని అన్నారు.
ఈ మార్గాల నిర్మాణం కోసం నేను ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులతో, రక్షణ శాఖ అధికారులతో చర్చలు జరిపాను.ప్రజల నిట్టూర్పు తుడిచే ఈ నిర్ణయం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది,” అని మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.