వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 21, మనవార్త.

చర్లపల్లి డివిజన్ పరిధిలోని మోడీ విస్టా లో ప్రధాన సమస్య వాటర్ బిల్ అధికంగా వస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డిని కలిసి వాటర్ బిల్ అధికంగా వస్తుందని దానికి తోడు ఇంట్రెస్ట్ కూడా వేయడంతో Rs 7,45,240 /- రూపాయలు వచ్చింది అని తెలియజేయగా వెంటనే స్పందించిన ఎండీ సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, మోడీ విస్టా మాజీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, వీర బ్రమ్మాచారి, కృష్ణ రావు, నర్ర వీర భద్రరావు, భాస్కర్, భరణీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment