- జూన్ 17న ఛలో ఇందిరాపార్క్ ధర్నాని జయప్రదం చేయండి.
తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, జూన్ 16, మనవార్త.
గత ప్రభుత్వం రాష్ట్రంలోని రజకులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తే నేడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న సర్కారు గత పదిహేను నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని అందుకే ఈ నెల17 న నగరంలోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తన్నామి రజక వృత్తి దారుల సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల లో ధర్నాకు సంబంధించిన కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రజక వృత్తి దారుల సంఘం మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబే చక్రపాణి మాట్లాడుతూ కులవృత్తులను అర్దికంగా అందుకునేందుకు గాను గత ప్రభుత్వం రజక వృత్తి దారులకు ఉచిత విద్యుత్ అందించారని అన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలల నుండి విద్యుత్ చార్జీలు చెల్లించడం లేదని దాంతో విద్యుత్ అధికారులు వృత్తి దారులపై వత్తిడి తెస్తున్నారని కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. రజకుల సమస్యలపై ఈ నెల17 న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఆ ధర్నాకు రజకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల అద్యక్షుడు అంబే శ్రీనివాస్, చెంగిచెర్ల కార్యదర్శి, అంబే కృష్ణ,నరసింహ, యాదయ్య, మల్లేష్, చందర్, రమేష్, నవీన్ కుమార్, కోశాధికారి మహేష్,రాజు, రమేష్, లక్ష్మి ,పద్మ, స్నేహ, నాగరాణి, గోకుల్,కవిత,నాగమణి,పల్లవి, ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.