ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కట్కూరి శ్రీనివాస్….

వేములవాడ జూన్ 14 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్)

వేములవాడ పట్టణ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేత కట్కూరి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని, ప్రజల కోసం మరింతగా పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని కట్కూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. కట్కూరి శ్రీనివాస్ వెంట దాదాపు 200 మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ చేరికలు పట్టణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుతామని ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజ్యం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ధైత కుమార్, కృష్ణ, నాగరాజు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పార్టీ నేతలు నేతలు బింగి మహేష్, గూడూరి మధు, పాత సత్యలక్ష్మి, తోట లహరి, ఫిర్ మహ్మద్, భాశెట్టి రవీందర్, పులి రాంబాబు, పుల్కమ్ రాజు, కూరగాయల కొమురయ్య, ఇప్పపుల అజయ్, మైలారం రాము, ఎర్ర శ్రీనివాస్, ముప్పిడి శ్రీధర్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ చేరిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Leave a Comment