రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవారు తిరిగి స్వంత గూటికి రావాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కో ఆప్షన్ సభ్యులు

. వేములవాడ జూన్ 14 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ )రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శనివారం వేములవాడ పట్టణంలోని తాటి కొండ రాజయ్య ఫంక్షన్ హాల్ లో వేములవాడ మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్ 200 మందితో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది..వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..కాంగ్రెస్ పార్టీలోకి రావడం మళ్ళీ తిరిగి స్వంత ఇంటికి వస్తున్నట్లుగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని, ప్రజల కోసం మరింతగా పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానని, అనాడు కాంగ్రెస్ గెలిచిన 3 ఎంపీటీసీ లో తను ఒకడినని గుర్తు చేశారు.. కాంగ్రెస్ పార్టితో తనకు విడదీయరాని అనుబంధం పెనవేసుకుందిని కట్కూరి శ్రీనివాస్ పేర్కొన్నారు..*ప్రభుత్వ విప్ మాట్లాడుతూ* ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్ననని అన్నారు..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి పేద ప్రజలకు అనేక పథకాలను రూపకల్పన చేసిందని తెలిపారు.. కొత్త పాత అనే తేడా లేకుండా కలసిగట్టుగా పని చేస్తు ముందుకు పోవాలన్నారు..ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలన్నారు.. గత ప్రభుత్వాలు పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడ అమలు చేయలేదన్నారు.అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేసుకుందాం అన్నారు..గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసి వేర పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని వారందరు తిరిగి స్వంత గూటికి రావాలని పిలపునిచ్చారు…చేరిన వారిలో కాముటాల వేణు,కముటల రాజు, తాటికిండ అనిల్, ఎర్రబెల్లి రాజశేఖర్, వంగర కిరణ్ ఉన్నారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజ్యం, కొనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కాచ్చకాయల ఎల్లయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ధైత కుమార్, కృష్ణ, నాగరాజు, తోట రాజు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట లహరి,నాయకులు,కూరగాయల కొమురయ్య,బింగి మహేష్,పుల్కమ్ రాజు, గూడూరి మధు, పాత సత్యలక్ష్మి,ఫిర్ మహ్మద్,భాశెట్టి రవీందర్,పులి రాంబాబు, ఇప్పపుల అజయ్, ముకుంద రెడ్డి,ఎర్ర శ్రీనివాస్, ముప్పిడి శ్రీధర్, కార్యకర్తలు తదితరాలు ఉన్నారు.

Leave a Comment