అంబేద్కర్ విగ్రహం గౌరవానికి భంగం కలిగించేలా ఓ ఫ్లెక్స్తొ తోలగించాలన్న డిమాండ్..మల్కాజ్గిరి కంటోన్మెంట్ మన వార్త జిల్లా ప్రతినిధి అంతోని : లోతుకుంట ప్రాంతంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం తాజాగా గౌరవానికి భంగం కలిగించేలా ఓ ఫ్లెక్స్ బ్యానర్‌తో కప్పబడి ఉంది. ఈ దృశ్యం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. రాజ్యాంగ నిర్మాతగా భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా అవమానకరంగా మూమరిపెట్టడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన కొందరు సామాజిక కార్యకర్తలు, “ఇది కేవలం అనాదరణ కాదు, ఆ మహనీయుడి సేవలకు గౌరవించకపోవడం” అని పేర్కొన్నారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత కాంటోన్మెంట్ బోర్డు లేదా జిహెచ్ఎంసి అధికారులను సంప్రదించి, అవసరమైన అనుమతులు లేకుండా ఉంచిన ఫ్లెక్స్ తొలగించాలన్న డిమాండ్ స్థానికులు చేస్తున్నారు. అలాగే విగ్రహానికి తగిన గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని వారుకోరుతున్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అతని విగ్రహానికి ఎలాంటి అవమానకర పరిస్థితులు ఏర్పడకుండానే ప్రభుత్వం,స్థానిక అధికారులు నిఘా ఉంచాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.