తెలంగాణస్టేట్ బ్యూరో భాస్కర్ చారి, జూన్ 10 మనవార్త.
మన్సూరాబాద్ డివిజన్, జడ్జస్ కాలనీ ఫేస్-1 లో 54,40,000 లక్షల నిధుల రూపాయలతో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పరిసర కాలనీల సంక్షేమ నాయకులతో కలిసి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి అట్టి ప్రదేశంలో పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…హిందూ స్మశాన వాటికలో అన్ని హంగులతో సీ.సీ రోడ్లు, గార్డెన్, గ్రానైట్ తో నిర్మాణం, పెయింటింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కావాల్సిన ప్లంబింగ్ సామాగ్రి తదితర పనుల ఆధునికతతో స్మశాన వాటికను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు.
జడ్జస్ కాలనీ ఫేస్-1, జడ్జస్ కాలనీ, శుభోదయ కాలనీ, విజయశ్రీ కాలనీ, చిత్రసీమ కాలనీ, హిమపురి కాలనీ, సహారా స్టేట్స్, చండీశ్వరి కాలనీ, కమలానగర్ తదితర కాలనీల సంక్షేమ నాయకులు కలిసి ఆటోనగర్ ప్రాంత మన్సూరాబాద్ హిందూ స్మశాన వాటికు కమిటీ వేసి ఇట్టి స్మశాన వాటికకు వాచ్మెన్ ను నియమించాలని వారికి సూచించారు. మన్సూరాబాద్ కాటికాపరులు దహన సంస్కారాలకు అడ్డగోలుగా నగదు తీసుకోవద్దని, స్మశాన వాటికలో కాష్టం మాత్రమే చేయాలని బొందలు అస్సలు పెట్టకూడదని లేదంటే చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల సంక్షేమ నాయకులు సయ్యద్ జానీ, దామోదర్ గౌడ్, మోహన్ రెడ్డి, బిక్షపతి, శ్రీశైలం యాదవ్, రాములు, బద్రీనాథ్, షణ్ముఖ చారి, వెంకటేశ్వర్ రెడ్డి, యాదయ్య, జనార్దన్ రావు, వెంకటేశం, సుకుమార్, శివ, అనిల్, బిజెపి నాయకులు ఆదినారాయణ రెడ్డి,మొరిశెట్టి సంతోష్ కుమార్, రాఘవేందర్,పాతూరి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.