పిఎసి సభ్యులుగా బీర్ల ఆయిలయ్య నియామకం…

యాదాద్రి జిల్లాలో బీర్ల ఆయిలయ్యకు పలువురి ప్రశంసల వెల్లువ…

యాదాద్రి భువనగిరి జిల్లా,మే 30 (మన వార్త జిల్లా ప్రతినిధి) తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ “పిఎసి” సభ్యుడిగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ 22 మంది సభ్యులతో కూడిన పత్రాలను ఢిల్లీలో ఆయన గురువారం రోజు సాయంత్రం మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్యకు పలువురి ప్రశంసలు అభినందనలు తెలిపారు. సందర్భంగా ఆయిలయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఏఐసిసి మరో బాధ్యతను అప్ప చెప్పడంతో నాకు మరింత బాధ్యత పెరిగిందని , నా పైన నమ్మకంతో అప్ప చెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తానని అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటానని , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లా ఆలేరు ప్రజలకు అందుబాటులో ఉంటానని , నేను నాయకుడిని కాదు మీ సేవకుడిని నాతో అడిగే పని చేయించుకోవాలని జిల్లా ఆలేరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Comment