శంకరపట్నం,మే28(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్ )జర్నలిస్ట్ రంగానికి వన్నెతెచ్చిన సీనియర్ పాత్రికేయుడు గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి129వ జయంతి వేడుకలు బుధవారం శంకరపట్నం మండలం కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోరెం శ్రీనివాస్ రెడ్డి,ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి,చిత్రపటానికి తహసిల్దార్ టిపిసిసి సభ్యులు మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బస్వయ్య గౌడ్,ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, ఏఎస్ఐ సుధాకర్,మాజీ ప్రజా ప్రతినిధులు దొంగల రాములు, గట్టు తిరుపతి గౌడ్,గాండ్ల తిరుపతి,మోత్కూరి సమ్మయ్య,జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు.అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.