గజ్వేల్, మే 23 (మన వార్త ప్రతినిధి జీ మురళి)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు పంజాల రవి గౌడ్, పాలే రామ్ గౌడ్, శుక్రవారం హైదరాబాదులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పంజాల రవి గౌడ్ మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్గొంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకోవడం జరిగిందని అన్నారు