వేములవాడలో విజయవంతంగా తిరంగ యాత్ర…

-భారత సైన్యానికి మద్దతుగా బీజేపీ నేతృత్వంలో మహా ర్యాలీ…
వేములవాడ,మే 23 ( మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ ) వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన తిరంగ యాత్రను నియోజకవర్గ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పార్టీ ఇంచార్జి చెన్నమనేని వికాస్ బాబు, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రూరల్ మరియు అర్బన్ అధ్యక్షులు, చందుర్తి మండల అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, హిందూ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. ఈ యాత్ర “ఆపరేషన్ సిందూరు”కు మద్దతుగా, భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాసటగా నిలిచే విధంగా సాగింది. పౌరుల నుంచి విశేష స్పందన లభించడంతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

Leave a Comment