జమ్మికుంట , మే 22 ( మన వార్త ప్రతినిధి):జమ్మికుంట తహశీల్దార్ గా ఎన్ వెంకట్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు.సాధారణ బదిలీల్లో భాగంగా జమ్మికుంట తహశీల్దార్ గా ఎన్ వెంకట్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు.ఇంతకముందు ఇతను సిద్దిపేట లో విధులు నిర్వహించారు.ఇక్కడ పనిచేసిన తహసిల్దార్ రాజు బదిలీపై వెళ్ళగా నూతన తహశీల్దార్ గా వెంకట్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నూతన తహసిల్దార్ కు సిబ్బంది పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా నూతన తసిల్డార్ మాట్లాడుతూ అందుబాటులో ఉంటూ వృత్తిరీత్యా ప్రజలకు సేవలందిఇస్తానని తెలిపారు.