హసన్ పర్తి మే22(మనవార్త ప్రతినిధి):టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని టీపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు బందెల రాజభద్రయ్య గురువారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా రాజభద్రయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.కాంగ్రెస్ పార్టీలో గత 30సంవత్సరాల నుండి క్రీయాశీల రాజకీయాల్లో పనిచేస్తున్నందుకు రాజభద్రయ్యను జగ్గారెడ్డి ప్రశంసించారు. తనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇప్పించుటకు సహకరించాలని రాజభద్రయ్య జగ్గారెడ్డిని కోరగా తప్పక నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన వారికి,ఎన్నికల సమయంలో పదవులను త్యాగం చేసిన వారికి కాంగ్రెస్ అదీష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పక తగిన పదవి ఇస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల మణిదీప్,కొండల్ రెడ్డి, దేవేందర్, కిరణ్ సాయి, శివ,బొడ్డు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.