హిందూఏక్తాయాత్రను విజయవంతం చేయండి…

-బిజెపి పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్….
వేములవాడ మే 21 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్ హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బిజెపి వేములవాడ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ హిందూ సంఘటితం కొరకు గత 15 సంవత్సరాలుగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ ఎగ్తయాత్రను వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు హిందువులందరం కూడా బంధువులుగా ఏకతాటిపై రేపటి హిందూ ఏక్తా యాత్ర విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూవు పై ఉందని ఆయన తెలియజేశారు

Leave a Comment