-నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం…
మే16(మనవార్త) తెలంగాణ వ్యవసాయశాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నాతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వానాకాలం పంటలకు సన్నద్ధమవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.