మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి…

గజ్వేల్ మే 19,(మన వార్త ప్రతినిధి జీ మురళి)bగజ్వేల్ లోని మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి0ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో రోడ్ల వెంబడి కొన్ని వేల క్వింటాళ్ల వరి ధాన్యం రోడ్లమీద ఉందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ధాన్యం కొనడంలో విఫలమైందని తెలిపారు మార్కెట్ యార్డులలో రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా వరి ధాన్యమే కనిపిస్తుందని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా వరి ధాన్యాన్ని కొనడంలో లారీలను బార్ధాన్ను సమకూర్చడంలో విఫలమైందని మండిపడ్డారు అకాల వర్షాలతో వరి ధాన్యం కొన్ని చోట్ల తడిసిపోవడం వలన రైతులు లబోదిబోమంటున్న వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదని మండిపడ్డారు వరి ధాన్యం మ్యాచూర్ వచ్చి కొనే పరిస్థితిలో ఉన్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బార్ధాన్లేదని లారీలు లేవని వారి ధాన్యం కొనకుండా దళారులకు అమ్ముకునే విధంగా వెసులుబాటును కల్పిస్తుందని మండిపడ్డారు వరి ధాన్యం కొనవలన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాన్యానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు దళారులు రైతుల యొక్క నడ్డిని విడుస్తూ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నామని చెప్పడం విడ్డూరమని తెలిపారు మళ్లీ విత్తనాలు వేసుకునే సీజన్ వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని తెలిపారు ఇప్పటివరకు వరి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రోడ్లమీద వరి ధాన్యం ఉండడంతో నియోజకవర్గంలో అక్కడక్కడ బైక్ ఆక్సిడెంట్ ల వలన చనిపోయారని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల దయ చూపి తొందరగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు రైతులు వారి ధన నింపుకునేందుకు సరిపోయేంత భార్దాన్ని సమకూర్చాలని తెలిపారు
సన్న వడ్లకు వెంటనే బోనస్ ఇవ్వాలని రైతులు పెట్టిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని జమ చేయడంలో జాప్యం చేయకూడదని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కౌన్సిలర్లు గుంటుకు రాజు మరికంటి కనకయ్య మల్లేశం ప్రవీణ్ తదితరులు ఉన్నారు

Leave a Comment