స్వరాజ్య వేదిక ద్వారా రైతుకుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ తరఫున ఆర్థిక సహాయం…

మనవార్త :కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం చిన్నకొమటిపల్లి గ్రామానికి చెందిన చెందిన ముక్క సదయ్య కౌలు రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. భూమిని కౌలు తీసుకొని పత్తి సాగు చేసినాడు. పంట దిగుబడి రాకపోవడం వలన 4 లక్షల వరకు అప్పులు అయినాయి. తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక తరఫున పరామర్శ చేసి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా ఆ సంస్థ ద్వారా రూ.40,000/-లు ఆర్థిక సహాయంతో బర్రె కొని ఇవ్వడం జరిగింది. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య లు సమన్వయ కర్తలుగా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ సభ్యులు కన్నూరి సదానందం, రాచపల్లి సమ్మయ్య , ఇంజం చైతన్య, వెంకటేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వ ప్రవేశపెట్టిన 194 జిఓల ద్వారా రైతు ఆత్మహత్య కుటుంబాలకు రూ.6,00,000/-లు, నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ముక్క ఐలయ్య , జిల్లా కమిటీ సభ్యులు, కన్నూరి సదానందం, రాచపల్లి సమ్మయ్య, ఇంజం చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment