ఇల్లంతకుంట మే 16 (మన వార్త ప్రతినిధి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట గ్రామానికి చెందిన మేరుగు సంతోష్ (35) సంవత్సరాలు శుక్రవారం రోజున అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడికి భార్య ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.మృతుడి భార్య జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం మాకు చిన్నపాటి కిరాణం షాప్ ఉన్నందున నడిపించుకుంటూ నా భర్త సంతోష్ గూడ్స్ ఆటో నడిపేవాడు మండలంలోని పలు గ్రామాలలో పత్తి వ్యాపారం చేసుకుంటూ కొన్ని రోజులుగా జీవనం కొనసాగిస్తున్నామన్నారు.ఈ క్రమంలో కొత్త ఇల్లు కట్టుకోవడం వలన ఆ ఇల్లు కట్టిన నిర్మాణానికి పత్తి వ్యాపారంలో నష్టం వచ్చిన మొత్తం 30 లక్షల వరకు అప్పులు అయినాయి అని.వ్యాపారంలో ఆశించినంత లాభాలు రాలేక అప్పులు పెరిగిపోవడంతో అప్పులు ఎలా కట్టాలో తెలియడం లేదని.చాలాసార్లు తన భార్యతో చెప్పుకుంటూ బాధపడేవాడని.ఈ అప్పులు తీరకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తట్టుకోలేక రోజువారీగా గూడ్స్ ఆటో తీసుకొని శుక్రవారం రోజున ఉదయం చుట్టుపక్కల గ్రామంలో మామిడికాయల లోడు కిరాయి ఉన్నందున తీసుకొని పోతా అని చెప్పి పోయి గాలిపల్లి పెద్దమ్మ గుడి దగ్గర రోడ్డు పక్కన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు.ప్రభుత్వం మానవ దృక్పథంతో ఆలోచించి రెక్కడితే గాని డొక్కాడని తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటుంది.ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై కదిరే శ్రీకాంత్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.అనంతరం భార్య మేరుగు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.