వేములవాడ ఫిబ్రవరి 04 (మన వార్త )
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు అభ్యర్థి సిరిగిరి సంగీత శ్రీకాంత్ ఇంటింటా ప్రచారం ద్వారా ప్రజల్లోవిశేషస్పందనపొందుతున్నారు.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయన ప్రచారం వార్డులో ప్రత్యేక ఆకర్షణగా మారింది.రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేదలు, మహిళలు, యువత సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని సంగీత శ్రీకాంత్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరించిన ఆయన, పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.10వ వార్డులో మార్పు కోరుతున్న ప్రజల ఆశలతో కాంగ్రెస్ శిబిరం మరింత బలపడుతున్నట్టు ప్రచారం ద్వారా స్పష్టమవుతోంది.