వేములవాడ ఫిబ్రవరి 05 (మన వార్త )
వేములవాడ పట్టణ 15 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా పుల్కం రాజు 15 వార్డులో ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు వార్డు ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మీ వాడిగా వార్డులో ఉంటూ మీకు సేవ చేస్తానని గతంలో కౌన్సిలర్ గా చేసిన అనుభవం నాకు ఉందని వార్డు మరింత అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నైనా నాకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని 15వ వార్డు ప్రజల్ని ఈ సందర్భంగా పుల్కం రాజు కోరారు నేను గెలిచిన వెంటనే వార్డు డ్రైనేజీ సమస్యలు కానీ,నీటి సమస్యలు కానీ పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, 15వ వార్డు ప్రజలు పాల్గొన్నారు