వేములవాడ, ఫిబ్రవరి 02 (మన వార్త)
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిపెల్లి అర్చన నరేష్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.ప్రచారంలో భాగంగా అర్చన నరేష్ ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధి కోసం తాను చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాట్లు, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్ల అభివృద్ధి తన ప్రాధాన్యతలని ఆమె తెలిపారు.స్థానిక ప్రజలు ఆమెను ఆత్మీయంగా స్వాగతిస్తూ పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ప్రచార ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు “జై కాంగ్రెస్ – జై జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేశారు. పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ అర్చన నరేష్ నాయకత్వంలో 11వ వార్డు అభివృద్ధి కొత్త ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు, మహిళా నేతలు, యువజన విభాగం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.