బెజ్జంకి,జనవరి 31 (మన వార్త ప్రతినిధి )కన్నతల్లిని కుమారుడిని చంపి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కన్నతల్లిని, కుమారుడుని చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జక్కని సత్యనారాయణ వడ్లూరూ గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ గత కొన్ని రోజులు నుండి వారి యొక్క కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఆయన భార్య కరీంనగర్ ఆసుపత్రికి పన్ను నొప్పి ఉందని వెళ్ళిందని తెలిపారు. తిరిగి మళ్లీ వడ్లూరు గ్రామానికి వచ్చేసరికి ఇంట్లో కుమారుడు నరేష్(38) జక్కని సత్యనారాయణ తల్లి శారద (80) రక్త గాయాలతో చనిపోయి ఉన్నారు. మరో క గదిలో జక్కని సత్యనారాయణ(65)సంవత్సరాలు ఇంట్లో ఉడివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో చూసిన సంఘటనను సత్యనారాయణ భార్య చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో, చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రేష్మి పేరు మాల్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి,సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, బెజ్జంకి ఎస్సై సౌజన్య సంఘటన స్థలానికి చేరుకొని, ఆత్మహత్య చేసుకున్న సత్తయ్య నివాసాన్ని తనిఖీ చేసి కీలక ఆధారాలు సేకరించి, కేసులు అన్ని కోణాల్లో నిక్స్పక్షపాతంగా విచారిస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిద్దిపేట సిపి రష్మీ పేరులాల్ తెలిపారు.