చందుర్తి, జనవరి 27,మన వార్త.క్రీడాకారులు గెలుపోవటం లను సమానంగా స్వీకరించి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మర్రిగడ్డ సర్పంచ్ దూది మనీషా – శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని మండల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు.మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసి ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు,శరీరక బృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్రీడల నిర్వహణకు కృషి చేశామన్నారు. యువజన సంఘాలు,క్రీడాకారులు మరుగున పడిన గ్రామీణ క్రీడల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు పుల్లూరి సాయి కిరణ్, నాయకులు కత్తి రాము, నరసయ్య, మాజీ ఎంపిటిసి, పుల్లూరి తిరుపతి,క్రీడాకారులు పాల్గొన్నారు