ములుగు జనవరి 25 మనవార్త రాష్ట్రంలో ముఖ్య నేతకానీ కుల సంఘం నాయకులు కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామం సమ్మక్క,సారాలమ్మ ప్రాంగణంలో నేతకాని సంఘం జిల్లా అధ్యక్షులు,బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు ఆధ్వర్యంలో మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన జనగాం గంగలక్ష్మి ని,మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనర్సింహా స్వామి దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన చప్పిడి ఎంకటేశ్వర్లను, ములుగు జిల్లా ఎస్సి, ఎస్టీ మనిటరింగ్ సభ్యలు సనారకని రాంబాబు ను, స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్, వార్డ్ సభ్యులను నేతకానీ కుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. మంత్రి ధనసరి సీతక్క నామినేటెడ్ పదవులు ఇచ్చినందుకు కుల సంఘం సభ్యులు,నేతకానీ సంఘ నాయకులు సీతక్క కు ధన్యవాదములు తెలిపారు.సమాజ అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ,గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి వర్యులు ధనసరి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.నేతకాని కులాన్ని గుర్తించి వారికి నామినేటెడ్ పదవులు కల్పించినందుకు నేతకాని కులస్థులు ఎప్పటికీ రుణపడి ఉంటరాని ఆ సందర్భంగా అన్నారు.మంత్రివర్యులు సీతక్కకు నేతకాని సమాజం ఎదుర్కొంటున్న సామాజిక,ఆర్థిక వెనుకబాటుతనంపై ప్రత్యేక అవగాహన ఉందని, భవిష్యత్తులో కూడా మా సమాజాన్ని మరింత గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడంతో పాటు మరిన్ని పదవులు, అవకాశాలు కల్పిస్తారని ఈ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నేతకాని కుల సంఘం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నేతకాని సమాజానికి చెందిన ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.