చందుర్తి, జనవరి 20, మన వార్త.చందుర్తి మండలం కిష్టంపేట గ్రామం లో దాదాపు 1000 మంది ప్రజల దాహార్తిని తీర్చే శుద్ధ జల కేంద్రం(వాటర్ ప్లాంట్) గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది.కిష్టంపేట గ్రామ మసీద్ ముందర ఉన్న శుద్ధ జల కేంద్రం మరమ్మత్తులు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయకపోవడం వల్ల గ్రామస్తులు, అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచ్ మొకానపెల్లి దేవరాజు ప్రత్యేక చొరవ తీసుకోని నూతన శుద్ధ జలకేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.