గ్రామాభివృద్ధికి నిధులు మంజూరి చేయించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం అందజేసినగుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య….

బెజ్జంకి,జనవరి 16( మన వార్త రిపోర్టర్ )సిద్దిపేట బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డితో కలిసి శుక్రవారం గుగ్గిళ్ల గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరి చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ను,కరీంనగర్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు,సీసీ రోడ్లు,పలు అభివృద్ధి పనులను మంజూరి చేయించి,నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి గ్రామ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment