హైదరాబాద్,జనవరి24(మనవార్త)మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు.ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ రైళ్లలో రిజర్వేషన్ ఉండదని అధికారులు తెలిపారు.ఈ నెల 28 నుంచి 30 వరకు సికింద్రాబాద్, మంచిర్యాల మీదుగా 3 సర్వీసులు, మంచిర్యాల-సికింద్రాబాద్ మధ్య మరో 3, సికింద్రాబాద్- సిర్పూర్కాగజ్నగర్కు 2, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్‌కు 2, నిజామాబాద్-వరంగల్మధ్య 4, వరంగల్-నిజామాబాద్ మధ్య 4, కాజీపేట-ఖమ్మం మధ్య 4, ఖమ్మం – కాజీపేట మధ్య 4, ఆదిలాబాద్-కాజీపేట మధ్య 1, కాజీపేట – ఆదిలాబాద్మధ్య ఒక సర్వీసు నడపనున్నట్టు అధికారులు తెలిపారు.ఈ రైళ్లన్నీ మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘనాపూర్, పిండ్యాల్, కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, రామగుండం తదితర స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.