గజ్వేల్ నవంబర్ 30 మన వార్త ప్రతినిధిగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో గజ్వేల్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గజ్వేల్ ఏసిపి నర్సింలు ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలలో గట్టి నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు, జాలిగామ గ్రామంలో ప్రధాన కూడల్లో, ప్రత్యేక బలగాల సిబ్బందితో గజ్వేల్ పోలీసు సిబ్బందితో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సి ఐ లు రవికుమార్, ముత్యం రాజు, ఎస్ఐలు ప్రేమ్ దీప్, మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.