కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ నియామకంపై అన్యాయం.

  • హై కోర్టు న్యాయవాది ప్రసన్న కుమార్.

తెలంగాణస్టేట్ బ్యూరో, భాస్కర్ చారి, నవంబర్ 26, మనవార్త.

కురుమ(బీసీ)కుల సంఘాల హక్కులపై ప్రశ్నలు లేచేవిధంగా, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ నియామకమైన దిశగా ఉందని అసమర్థవంతమైన, ప్రశ్నార్థక విధానం”పై తెలంగాణ హైకోర్టు న్యాయవాది ప్రసన్న కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటన ప్రకారం, ట్రస్టీ బోర్డు సభ్యులతో కానీ అందుబాటులో ఉన్న ఇతర వర్గాలకు (ప్రత్యేకంగా కురుమ సంఘాలకు) అవకాశాలు లేకపోవడంతో ఇది అన్యాయమైన నియామకం అని ఆయన అపహాస్యంగా అన్నారు. దేవునికి కులం లేదు దేవాలయాలు మన సంస్కృతి, మన వారసత్వం అని ప్రసన్న కుమార్ అన్నారు. చట్టపరమైన గోప్యతకు హోదా చైర్మన్ ట్రస్టీల ఎంపిక ప్రజా ప్రతినిధ్యంపై ఆధారపడి ఉండాలి కానీ ప్రస్తుత నియామకంలో “పబ్లిక్ నోటిఫికేషన్” లేకపోవడం, దరఖాస్తుల స్వీకరణ లేకపోవడంతో ప్రజల హక్కులను దెబ్బతీస్తుంది. నియామక ప్రక్రియలో నిర్ణయం తీసుకోవడం“సమాన అవకాశాల హక్కు”ను (ఆర్టికల్ 14)వేటాడుతుంది.
ఎండోవ్‌మెంట్స్ శాఖకు రాతపూర్వక ఫిర్యాదు ద్వారా సమాన అవకాశం ఇవ్వకపోవడం, నోటిఫికేషన్ లేకపోవడం వంటివి స్పష్టం చేయాలి. కురుమ (బీసీ) సమాజానికి సందేశం ప్రసన్న కుమార్ ఆహ్వానం చేశారు స్థానికులు, సంఘాల నేతలు, భక్తగణం సమూహంగా ముందుకు రావాలి.ఇది కేవలం ఒక దేవాలయ చైర్మన్ నియామకం కాదు. మన వారసత్వం, సమాజ హక్కుల విషయమే అని అన్నారు. పారదర్శకత లేకుండా నియామకాలు చేయడం, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కుల-ఆధారిత నియామకాల ప్రక్రియకు ప్రభుత్వ అధికారులు, కమిషన్, స్వచ్ఛంద సంఘాలు సమగ్ర సమీక్ష చేయాలని హైకోర్టు అడ్వకేట్ ప్రసన్న కుమార్ తెలంగాణ తెలియజేసారు.

Leave a Comment