ఎల్కతుర్తి నవంబర్ 24 మన వార్త ప్రతినిధి ఎల్కతుర్తి మండలం వీరనారాయణపురం (దగ్గువారిపల్లి) గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి పూజారిగా భక్తి పూర్వకంగా సేవలందిస్తున్న సిద్ధాంతి సంతోష్ (43) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10:40 నిమిషాలకు మృతి చెందిన విషయం తెలిసిందే రెండు రోజులుగా అస్వాస్తతతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మొదట గ్రామంలోని స్థానిక వైద్యులను సంప్రదించారు అయితే పరిస్థితి క్షీణించడంతో వెంటనే అనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు గ్రామంలో ఆయన మరణ వార్త తెలియగానే విషాదఛాయలు అలుముకున్నాయి సంతోష్ అయ్యగారు గ్రామంలో దేవాలయంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా పేరు పొందారు గ్రామ దేవాలయ కార్యకలాపాల్లో నిత్యం చురుకుగా పాల్గొనడమే కాక ప్రజలకు ధార్మిక సేవలు అందిస్తూ ఉండేవారు ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలను మరింత ముంచెత్తింది ఈ నేపథ్యంలో మృతిని కుటుంబం తీవ్ర విచారంలో ఉందని సమాచారం అందుకున్న తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ సోమవారం ఉదయం ప్రత్యేకంగా దగ్గువారిపల్లె చేరుకున్నారు. అక్కడ మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంతోష్ తల్లిదండ్రులు భార్య పిల్లలతో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. గ్రామ పెద్దలతో సమావేశమై కుటుంబ పరస్థితిని వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, సంతోష్ అయ్యగారి మరణం గ్రామానికి తిరిగిరాని నష్టం ఆయన ఎంతో శాంత స్వభావం కలవారు దేవాలయ కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేసేవారు ఇటువంటి యువకుడు అకాలములో మనల్ని విడిచిపోవడం ఎంతో బాధ కలిగించింది. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా బాధాకరం. భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. కుటుంబానికి అండగా నిలుస్తామని అవసరమైన సందర్భాల్లో రైతు రక్షణ సమితి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామానికి తిరిగి వెళ్లే ముందు భాస్కర్ గ్రామస్తులతో కూడా మాట్లాడి సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి నిలబడటం అత్యంత ముఖ్యమని సూచించారు. భాస్కర్ పరామర్శతో కుటుంబ సభ్యులు కొంత ధైర్యం పొందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పెద్దలు కూడా ఆయన పర్యటనను అభినందిస్తూ, బాధిత కుటుంబం పట్ల చూపిన మానవీయత ప్రశంసనీయం అని పేర్కొన్నారు. దగ్గువారి పల్లి గ్రామంలో సంతోష్ అయ్యగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు రానున్న రోజుల్లో కుటుంబానికి అండగా ఉండేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చకులు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సిద్ధాంతి గణేష్, హింగే రవీందర్, కందుకూరి రాజన్న, శ్రీ రామోజు సతీష్ చారి, కందుకూరి మహేష్ చారి, నార్లగిరి మహేందర్, చిర్ర ఉదయచందర్, పులింటి కుమార్, సింగరబోయిన రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.