రిజర్వేషన్లు మార్చకుంటే ఎన్నికలను బహిష్కరిస్థాం… గ్రామ ప్రజల తీర్మానం….

చిన్న శంకరంపేట నవంబర్ 24 ( మన వార్త ప్రతినిధి )చిన్న శంకరంపేట మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో వార్డుల రిజర్వేషన్లను అధికారులు ఇష్టం వచ్చినట్లు సవరించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు సోమవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వార్డుల్లో వచ్చిన రిజర్వేషన్లను పరిశీలించి అవక తవకలు జరిగాయని గతంలో వచ్చిన రిజర్వేషన్లకు ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని గతంలో ఒకటో వార్డు నుండి ఐదవ వార్డ్ వరకు బీసీ జనరల్ వచ్చిందని ఆరు నుండి 10 వ వార్డు వరకు ఎస్సీ జనరల్ రాగా ప్రస్తుతం ఒకటో వార్డు నుండి 5 వరకు ఎస్సీ జనరల్ వచ్చిందని ఆరు నుండి పది వరకు ఓసి జనరల్ వచ్చింది దీంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే రిజర్వేషన్లను మార్చాలని లేనిపక్షంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు తీర్మానించారు.

Leave a Comment