సొసైటీ అక్రమాలపై విచారణ చేపట్టిన అధికారులు…

చిన్న శంకరంపేట నవంబర్ 24 ( మన వార్త ప్రతినిధి )చిన్న శంకరంపేట మండలంలోని చందంపేట సహకార సంఘంలో నిధుల దుర్వినియోగం తో పాటు రైతుల డబ్బులను సీఈవో పాషాకాజేసిన విషయంపై సోమవారం డిసిఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అధికారి తుకారం విచారణ చేపట్టగా రైతుల నుండి సహకార సంఘం సీఈవో పై ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి, రైతుల ఖాతాల నుండి నేరుగా డబ్బులు డ్రా చేయడంతో పాటు సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వచ్చే రీబెట్ సొమ్ము కూడా మాయం చేశాడని రైతులు ఆరోపించారు, ఓ రైతు ఎల్ టి లోన్ తీసుకోకుండానే లోన్ తీసుకున్నట్లు రుణం డబ్బులు వసూలు చేశాడని రైతు తెలిపారు, దరిపల్లి గ్రామానికి చెందిన రైతు బాలేశ తీసుకున్న రుణాన్ని చెల్లించాలని రైతు నుండి 73 వేల రూపాయలు తీసుకొని నాలుగు నెలల తర్వాత 63 వేల రూపాయలు మాత్రమే జమ చేసి 10 వేల రూపాయలు సీఈఓ కాజెసి చేసినట్లు రైతు తెలిపారు, సొసైటీలో రైతులకు రుణాలు కావాలంటే లంచాలు ఇవ్వవలసిందేనని సిఈఓ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు సొసైటీ నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే సిబ్బందిని ఏర్పాటు చేయకుండానే సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు రికార్డులో చూపించి వారి సొమ్మును కాజెసినట్లు తెలిపారు కొనుగోలు కేంద్రాలలో లారీలలో నింపిన ధాన్యానికి 5 నుండి నుండి 10 క్వింటాళ్ల తరుగు వస్తున్నట్లు చూపించి వాటికి సంబంధించిన డబ్బులను కాజేసేవాడని రైతులు తెలిపారు, ఇలాంటి అనేక సమస్యలపై అధికారుల దృష్టికి రైతులు తీసుకువచ్చారు, వాటన్నిటిని నోట్ చేసుకున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ తుకారాం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఫిర్యాదులన్నింటినీ నివేదిక తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు వెంకటేశం, రామ్ రెడ్డి, రామకృష్ణ తోపాటు మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, దరిపల్లి మాజీ సర్పంచ్ సిద్దిరాంరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment