వెంకట్రావుపల్లిలో బీసీలు లేమా అంటున్న గ్రామస్తులు…**-443 బీసీలు ఉన్నప్పటికీ ఒక్క బీసీ వార్డు కేటాయించకపోవడంతో వెంకట్రావుపల్లె గ్రామంలో ఆందోళన…

ఇల్లంతకుంట,నవంబర్ 24 (మన వార్త ప్రతినిధి)ఇల్లంతకుంట మండలంలో సోమవారం సర్పంచ్-వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లిస్టును గెజిట్ ముద్రతో ప్రభుత్వం విడుదల చేసిన లిస్టు చూసి,మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన అనగోని యాదగిరి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ “మా గ్రామంలో 443 మంది బీసీలు,138 మంది ఎస్సీలు,34 ఓసీలు,5 ఎస్టీలు ఉన్నప్పటికీ ఒక్క బీసీ వార్డూ కేటాయించలేదు.ఏ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ లిస్టు రూపొందించబడింది..?”అని అధికారులు తెలియజేయాలని కోరారు.“మా హక్కులను ఇలా విస్మరించడం మాకు అంగీకారం కాదు.తప్పు వెంటనే సరిచేయకపోతే హక్కుల కోసం ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.”ఆయన కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని,తప్పు సరిచేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.వెంకట్రావుపల్లె గ్రామంలో 443 మంది బీసీలు ఉన్నప్పటికీ,ఒక్క బీసీ వార్డూ కేటాయించకపోవడం,4 ఎస్సీలు మరియు 4 జనరల్ వార్డులు కేటాయించడం స్థానికులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీ స్థానాలను జనరల్ లేదా ఎస్సీ వార్డులుగా కేటాయించడం పై గ్రామస్థులలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.అలాగే,ఇట్టి విషయంపై ఇల్లంతకుంట మండల ఎంపీడీవో శశికళ మేడం ను వివరణ కోరగా ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం లేదు.పైన అధికారులు పంపిన వివరాలను మేము గ్రామాల్లో అందజేస్తున్నాం.ముఖ్యంగా మండలంలో వెంకట్రావుపల్లి గ్రామం మరియు తిప్పాపూర్ గ్రామం ఇలాగే ఉన్నాయి”అని తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వం 42 శాతం BC రిజర్వేషన్ అమలు చేస్తోంది,కానీ వార్డుల కేటాయింపులో లోపం గ్రామస్థులను ఆందోళనకు ప్రేరేపించింది.“ఇట్టి విషయంపై మండల అధికారులు మరియు రాజకీయ నాయకులు దీనిపై దృష్టి సారించి బీసీలు ఉన్నారని న్యాయం చేయాలని కోరారు”,లేదంటే నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కూనబోయిన మల్లయ్య, బత్తిని వెంకటేష్,యాగర్ల మహేష్,లాస్య, జెట్టి రాయలింగం,పున్ని,బాగవ్వ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment